హైదరాబాద్: ఫార్జరీ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్  దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

టీవీ9 కొత్త యాజమాన్యానికి వ్యతిరేకంగా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ వ్యవహరించారని అలంద మీడియా సంస్థ ఆరోపించింది. ఏబీసీఎల్ లో 90 శాతానికి పైగా వాటాను అలందా మీడియా సంస్థ ఆరోపించింది.

యాజమాన్య బదిలీ విషయమై కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవిప్రకాష్‌తో పాటు సినీ నటుడు శివాజీలపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.