జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీ గూటికి చేరారు.

బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు సమావేశమవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేత స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.