ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భార్యభర్తలు చికిత్స్ పొందుతూ మృతి చెందారు. 

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ ఘాతుకానికి ఒడి గట్టింది. రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స తీసుకుంటూ రెండు రోజుల తరువాత మరణించారు. 

గత శనివారం మాజీ సర్పంచ్ బాబురావు, తన భార్య రంగమ్మతో కలిసి ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఇచ్చి, తామూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ సోమవారం భార్య,భర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు హనిస్వి, మహని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.