హైదరాబాద్: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ పాల్వాయి హరీష్ లతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు.2009లో ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ఎంపీగా విజయం సాధించిన రమేష్ రాథోడ్ 2014 తర్వాత టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.  ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2019 ఎన్నికల సమయంలో ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు.మరోవైపు సిర్పూర్ కాగజ్ నగర్  నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి హరీష్ కూడ బీజేపీలో చేరనున్నారు.

హరీష్ బీజేపీలో చేరాలని ఆయన తన అనుచరులకు సమాచారం పంపారు. అయితే కొందరి అనుచరులకు పంపే వాట్సాప్ సమాచారం పార్టీ నేతలకు చేరింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొన్న కాంగ్రెస్ నాయకత్వం హరీష్ ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.