పొన్నాలతో పొంగులేటి భేటీ: కీలకాంశాలపై చర్చ
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారు
హైదరాబాద్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచనలు, సలహలను తీసుకుంటామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.గురువారంనాడు హైద్రాబాద్ లో మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్యతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు . రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విషయమై చర్చించినట్టుగా శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
భద్రాచలంలో కరకట్ట నిర్మాణం కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇంతవరకు నిధులను విడుదల చేయలేదన్నారు.ఈ నెల మొదటి వారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేది నుండి బీఆర్ఎస్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు ప్రారంభించారు. ఏప్రిల్ మాసంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం తర్వాత బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన పై సస్పెన్షన్ వేటేసింది.దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.