నన్నుకలిసే వారిపై టీఆర్ఎస్ ఫోకస్: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
ఆత్మ గౌరవంచంపుకోలేక తాను టీఆర్ఎస్ ను వీడినట్టుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. టీఆర్ఎస్ లో ఉంటూ అవమానాలు భరించడం ఇష్టం లేకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన తెలిపారు.
హైదరాబాద్:తనను కలిసేందుకు వచ్చే నేతలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.ఆదివారం నాడు ఆయన హైద్రాబద్ లో మీడియాతో మాట్లాడారు.రెండు రోజుల క్రితమే టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఆత్మగౌరవం కోసమే తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్టుగా బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.
ఆత్మగౌరవం చంపుకుని టీఆర్ఎస్ లో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేసినట్టుగా ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలుపార్టీలు తనను సంప్రదిస్తున్నాయని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విసయమై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మునుగోడులో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఐదేళ్ల క్రితమేజాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని తాను కేసీఆర్ కు సూచించినట్టుగా చెప్పారు.
alsoread:నేను వ్యక్తిగతంగా అవమానపడ్డాను.. టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. కేసీఆర్‌కు లేఖ..
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ను బూర నర్సయ్య గౌడ్ ఆశించాడు. కానీ బూర నర్సయ్య గౌడ్ కు టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఈ సమయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లను కేసీఆర్ చర్చించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజునే బూర నర్సయ్యగౌడ్ ఢిల్లీకి వెళ్లారు.బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చలు జరిపారు. బీజేపీలో చేరే అవకాశం ఉంది.