తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా జడ్మీ చైర్మన్ గా పని చేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను చంద్రబాబు నాయుడు పార్టీలో ఆహ్వానించారు. 

Former MLC Kasani Gnaneshwar Mudiraj joined Telugu Desam Party

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనను తెలుగుదేశం నేషనల్ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత  జ్ఞానేశ్వర్‌కు పార్టీ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీలో చేరిన కాసాని 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు.  కానీ ఆ సమయంలో అక్కడి నుంచి ఓడిపోయారు. ఆయన గతంలో శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పని చేసిన అనుభవం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios