Asianet News TeluguAsianet News Telugu

వైద్యానికి డబ్బులు లేక.. మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి

1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది.

former MLA  Narasayya son died due to lack of money
Author
Hyderabad, First Published May 7, 2020, 7:26 AM IST

ఆయన గతంలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు. అయితే... ప్రజా ధనం దాచుకొని మేడలు కట్టుకోలేదు. కేవలం ప్రజా సేవే పరమావిధిగా జీవించాడు. ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతూ వచ్చాడు. తాజాగా.. కనీసం ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమోత కూడా లేకపోవడం ఆయన కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios