Asianet News TeluguAsianet News Telugu

అనుచరులతో ఏనుగు రవీందర్ రెడ్డి భేటీ: కాంగ్రెస్‌లో చేరుతారా?

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డి  తన అనుచరులతో  ఇవాళ సమావేశమయ్యారు. 

Former  MLA  Enugu Ravinder Reddy  meeting with his followers lns
Author
First Published Jul 6, 2023, 12:25 PM IST

కామారెడ్డి:  ఎల్లారెడ్డి  మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డి  గురువారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు . రవీందర్ రెడ్డి  బీజేపీని వీడుతారనే  ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ సమావేశానికి  ప్రాధాన్యత నెలకొంది.  ఈటల రాజేందర్ బీజేపీలో  చేరిన సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి  బీఆర్ఎస్ ను వీడి  బీజేపీలో  చేరారు . ఏనుగు రవీందర్ రెడ్డి  గత రెండు నెలలుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  2018  ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన రవీందర్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి  సురేందర్ రెడ్డి  చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత  పరిణామాల్లో  సురేందర్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో  చేరారు.  బీఆర్ఎస్ లో సురేందర్ రెడ్డి , ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య పొసగలేదు.  దీంతో రవీందర్ రెడ్డి  బీజేపీలో  చేరారు.

ఎల్లారెడ్డి  నియోజకవర్గంలో   అనుచరులతో  రవీందర్ రెడ్డి సమావేశమయ్యారు.  బీజేపీని వీడే విషయమై  రవీందర్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా సమాచారం.  రవీందర్ రెడ్డి  బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో  చేరే అవకాశం ఉంది.  

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏనుగు రవీందర్ రెడ్డి సమావేశం  కావడం కూడ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో  రవీందర్ రెడ్డి చేరేందుకు సన్నాహలు చేసుకుంటున్నారని ప్రచారానికి  ఊతమిచ్చేలా  ఈ భేటీ ఉందనే  అభిప్రాయాలను  రాజకీయ విశ్లేషకులు వ్యక్తం  చేస్తున్నారు.  ఎల్లారెడ్డి  అసెంబ్లీ  నియోజకవర్గం నుండి  గతంలో   రవీందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.  ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రవీందర్ రెడ్డి  బీజేపీని వీడాలనే యోచన చేయడం  ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు కీలక పదవిని అప్పగించింది.  బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్  కమిటీ చైర్మెన్ గా  రాజేందర్ ను ఆ పార్టీ నియమించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios