తీహార్ జైలుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టు అయిన ఆమె... ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. 

Former Ministers Sabitha Indra Reddy and Satyavathi Rathore of Tihar Jail GVR

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కస్టడీకీ అప్పగించింది. కవితపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన అరెస్టు చేసిన ఈడీ.. ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. అప్పటి నుంచి జైలులోనే ఆమె ఉన్నారు. బెయిల్ కోసం శత విధాలా ప్రయత్నించినా కోర్టు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న కల్వకుంట కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు పరామర్శించారు. తిహార్ జైలుకు వెళ్లి ఆమెతో ములాఖత్ అయి మాట్లాడారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా తీహార్ జైలుకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవితను ములాఖత్‌లో భాగంగా కలిశారు.

 

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసింది. డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ... ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని విచారించింది. అంతకుముందు హైదరాబాద్‌లోనే విచారణ చేపట్టిన ఈడీ.. కవిత విచారణకు సహకరించడం లేదన్న కారణంతో ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి కవితకు బెయిల్‌ లభించడం లేదు. ఢిల్లీ కోర్టుకు వెళ్లిన ప్రతిసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడం తప్ప మరొకటి జరగడం లేదు. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని, బీజేపీ రాజకీయ కక్షలో భాగంగానే తప్పుడు కేసులతో తనను వేధిస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios