రాహుల్‌తో తుమ్మల కీలక భేటీ.. ఖమ్మం, పాలేరు నుంచి కాంగ్రెస్ నాయకుల పోటీపై క్లారిటీ..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

Former minister Tummala Nageswara Rao Meets Rahul Gandhi in New Delhi ksm

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ విషయంలో సందిగ్దం నెలకొందనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించికుంది. వివరాలు.. ఢిల్లీ వెళ్లిన తుమ్మలనాగేశ్వరరావు.. కేసీ వేణుగోపాల్ సూచనతో తొలుత రాహుల్ గాంధీని కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ గాంధీతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నిలక వ్యుహాలపై ఇరువురు నేతలు చర్చించారు. 

రాహుల్‌తో భేటీ అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పోటీ చేయాలని రాహుల్ చెప్పారని తుమ్మల తెలిపారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే.. అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పాలేరు నుంచిపోటీ చేయాలని  అనుకున్నానని  తెలిపారు. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేసేలా రాహుల్ సమక్షంలో నిర్ణయం ఖరారైంది. 

ఇక, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తర్వాత తుమ్మల నాగేశ్వరరావు.. రాహుల్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి.  ఇదిలా ఉంటే, ఈరోజు మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్‌తో తుమ్మల నాగేశ్వరరావు భేటీ కానున్నారు.  ఇదిలాఉంటే, పాలేరు నుంచి  పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తుమ్మల కాంగ్రెస్‌లో చేరారని ఆయన అనుచరులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకుల నుంచి పోటీ నెలకొంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలేరు స్థానంపై పోటీ విషయంపై చర్చించేందుకే.. తుమ్మల ఢిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్‌తో భేటీ తర్వాత.. తాను పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios