హైదరాబాద్:  మాజీ మంత్రి రత్నాకర్ రావు, ఆయన తనయుడు  నర్సింగరావు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ మేరకు వారిద్దరూ కూడ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. రెండు మూడు రోజుల్లో రత్నాకర్‌రావుతో పాటు  ఆయన తనయుడు నర్సింగరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

 రత్నాకర్ రావు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మంత్రిగా పనిచేశారు.  కాలక్రమేణా రాష్ట్రంలో చోటు చేసుకొన్న  రాజకీయ పరిణామాల నేపథ్యంలో  రత్నాకర్ రావు  కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

అయితే తాజాగా  టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై రత్నాకర్ కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకొన్నారు.

టీఆర్ఎస్ కు రెండు మూడు రోజుల్లోనే రత్నాకర్ రావు రాజీనామా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆదివారం నాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో  రత్నాకర్ రావు, నర్సింగరావులు సమావేశమయ్యారు. వీరిద్దరూ కూడ  రెండు మూడు రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని సమాచారం.