హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి, తెలంగాణ పిసిసి ఓబీసీ సెల్ మాజీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరబోతున్నారు. 

తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి. కుంతియాపై, నిజామాబాద్ లోకసభ కాంగ్రెసు అభ్యర్థి మధుయాష్కీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చిత్తరంజన్ దాస్ సోనియా గాంధీకి లేఖ రాశారు. మార్చి 14వ తేదీన ఆయన ఈ లేఖ రాశారు. 

వ్యభిచారం కోసం అమెరికాకు మహిళలను తరలించి కుంతియా, మధు యాష్కీ కోట్లాది రూపాయలు సంపాదించారని, రాహుల్ గాంధీ పేరు చెప్పి 75 అసెంబ్లీ టికెట్లు అమ్ముకున్నారని, వారంతా ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెసు పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన చిత్తరంజన్ దాస్ త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. సోనియా గాంధీ కె. రాజు వంటి వ్యక్తిగత సిబ్బందితో వారిద్దరి వ్యవహారాలపై పరిశీలన జరపకపోతే పార్టీ మునిగిపోతుందని ఆయన అన్నారు.