కేసీఆర్ పార్టీలోకి పిలిచి అవమానించాడు.. కాంగ్రెస్ గెలిస్తే రేవంతే సీఎం: మోత్కుపల్లి
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినే బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 30 మందిని మారిస్తే గానీ ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి రాలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి నరసింహులు దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారని అన్నారు. జగన్ జైలులో ఉండి వచ్చినందుకు అందరూ జైలుకు పోవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌తో తెలుగు పరజలు అల్లాడిపోతున్నారని అన్నారు.
చంద్రబాబును మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. జగన్, కేసీఆర్, బీజేపీలు.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలన వల్ల ఏపీలో ఎవరూ సంతోషంగా లేరని.. రాజధాని లేని రాష్ట్రాన్ని ఆయన పాలిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు జగన్ ఆటలను సాగనివ్వరని అన్నారు.
సీఎం కేసీఆర్ తనను బీఆర్ఎస్‌లోకి పిలిచి అవమానించారని అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబేనని.. అలాంటిది ఆయనను కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. రేపు కేసీఆర్‌కు కూడా చంద్రబాబు పరిస్థితి వస్తే ఆ బాధ అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. ఒక్కసారైనా కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.