మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆయన ఓ జాతీయ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
కొల్లాపూర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని kollapur అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే ఆయన ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతలతో చర్చించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ లో జూపల్లి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి Jupally krishna rao పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి Harshavardhan reddy చేతిలో ఓటమి పాలయ్యాడు. హర్షవర్ధన్ రెడ్డి Congress ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య పోరు సాగుతుంది. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అభ్యర్ధులను గెలిపించుకొన్నారు. ఈ పరిణామాలపై TRS నాయకత్వం సీరియస్ అయింది.
పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన వారే ఎంపీపీలుగా ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో జూపల్లి వర్గానికి చెందిన వారికి టీఆర్ఎస్ బీ ఫాం లు ఇచ్చారు. అయితే విజయం సాధించినా కూడా వీరంతా జూపల్లి వర్గంగానే కొనసాగుతున్నారు. ఇటీవలనే ఖమ్మంలో టీఆర్ఎస్ లో అసమ్మతి వర్గంగా ఉన్న నేతలతో జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు త్వరలోనే ఓ జాతీయ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. బీజేపీ వైపు జూపల్లి కృష్ణారావు చూస్తున్నారని కూడా చెబుతున్నారు.ఇదే విషయాన్ని తన అనుచరులకు జూపల్లి కృష్ణారావు సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. కానీ ఈ విషయమై జూల్లి కృష్ణారావు నుండి స్పష్టత రాలేదు.
9 నెలల్లో ఏం జరుగుతుందో చూద్దాం
వచ్చే 9 నెలల్లో ఏం జరుగుతుందో చూద్దామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకొన్నా కూడా ప్రజల కోసమేనన్నారు. తన పదవుల కోసం కాదని జూపల్లి కృష్ణారావు శుక్రవారం నాడు మీడియాకు చెప్పారు. టీఆర్ఎస్ ను వీడే విషయమై జూపల్లి కృష్ణారావు మాత్రం నోరు విప్పలేదు.
