మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై మరో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని జేసీ దివాకర్ రెడ్డి జీవన్ రెడ్డి హితవు పలికారు.

హైదరాబాద్:మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై (Jc Diwakar ReddY) మాజీ మంత్రిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( jeevan ReddY) ఫైరయ్యారు.శుక్రవారం నాడు సీఎల్పీ (CLP )గదికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు కాంగ్రెస్ (congress )పార్టీ నేతలతో మాట్లాడారు.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:తెలంగాణను వదిలి నష్టపోయా, ఇక్కడికే వస్తా: కేటీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ

మా సీఎల్పీకి వచ్చి కాంగ్రెస్ ను డ్యామేజీ చేయాలని చూడొద్దని ఆయన హితవు పలికారు.మీ హితోక్తులు తమకు అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డికి తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. మంచి విషయాలు ఉంటే చెప్పాలని జీవన్ రెడ్డి సూచించారు.కానీ పార్టీ నష్టపోయేలా డ్యామేజ్ ప్రకటనలు చేయవద్దని జేసీ దివాకర్ రెడ్డికి జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి సీఎల్పీలో కాంగ్రెస్ నేతలతో సమావేశమైన తర్వాత అసెంబ్లీ లాబీల్లో కొద్దిసేపు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.