దళితుడికి న్యాయం చేయలేదు: కేసీఆర్ పై ఈటల ఫైర్
దళితుడిని సీఎం చేస్తానన్న హామీని కేసీఆర్ అమలు చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 16 శాతం దళితులున్నా వారికి న్యాయం జరగలేదని ఆయన చెప్పారు.
కరీంనగర్:దళితుడిని సీఎం చేస్తానన్న హామీని కేసీఆర్ అమలు చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు వీణవంకలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 16 శాతం దళితులున్నా వారికి న్యాయం జరగలేదని ఆయన చెప్పారు. దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తొలగించారని ఆయన గుర్తు చేశారు. 0.5 శాతం ఉన్నవారు కేబినెట్ లో ఎంతమంది ఉన్నారని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
మాజీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర రిటైరైన సమయంలో సంప్రదాయప్రకారంగా వ్యవహరించలేదన్నారు. అందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పదవీని పొడిగించినా కూడ ఆయనకు మాత్రం పదవిని పొడిగించలేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఎంఓలో ఎంతమంది దళిత అధికారులున్నారని ఆయన అడిగారు.ఇవాళ కొత్తగా సీఎం ఎంపవర్‌మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దళితులకు ఒరిగిదేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
అందరికీ అందుతున్నపథకాలే ఎస్సీలకు అందుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలను మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే పరిమితమయ్యాయన్నారు. మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం టీఆర్ఎస్ లో లేదన్నారు.