హుజూరాబాద్‌లో వచ్చే తీర్పే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం: ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ బిజెపియే, ఎగిరే జెండా కాషాయ జెండానే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక రిహర్సల్స్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రానుందన్నారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ బిజెపియే, ఎగిరే జెండా కాషాయ జెండానే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక రిహర్సల్స్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రానుందన్నారు.
గురువారం నాడు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.తాను గెలిస్తెనే ఈ రాష్ట్రానికి అరిష్టం తొలిగి పోతుందని ప్రజలు కోరుకుంటున్నారని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపద్యం లో ఐదుగురు మంత్రులు పదుల సంఖ్యలో ఎం ఎల్ ఏ లు పనించేస్తున్నారన్నారు.
తన నియోజక వర్గానికి వచ్చి ప్రజలకు పెన్షన్లు,తెల్ల రేషన్ కార్డులు,డబ్బులు ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆయన విమర్శించారు. తన ప్రజా ప్రతినిధులకు వెల కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్నికలు వస్తేనే పెన్షన్,రేషన్ కార్డులు,డబ్బులు వస్తాయన్నారు. నీ అధికారం ఇంకా రెండేళ్లు ఉందని ప్రజా ప్రతినిధులు తలలు ఊపుతున్నారన్నారు. కానీ వాళ్ళ అంతరాత్మ లో మాత్రం తానే ఉన్నానని ఆయన చెప్పారు.తనకు కులం తో మతం తో సంబంధం లేదన్నారు. తనకు మనిషి తో సంబంధం ఉంటుందని ఆయన చెప్పారు. తనను ఓడించేందుకు మండలానికి ఓ ఎసిపి వందల మంది ఇంటలిజెన్స్ సిబ్బంది, వేల మంది పోలీసులను నియోజకవర్గానికి కేటాయించారని టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.