Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్లు నాతో పని చేయించుకొని గెంటేశారు: గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల ఫైర్

గజ్వేల్ తనకు కొత్త కాదని  మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారు. ఇవాళ  బీజేపీ విజయ శంఖారావంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

Former Minister Etela Rajender  Serious Comments on  KCR in Gajwel lns
Author
First Published Oct 26, 2023, 5:05 PM IST

గజ్వేల్:  20 ఏళ్లు తనతో పని చేయించుకుని మెడపట్టి గెంటేశారని  మాజీ మంత్రి ఈటల రాజేందర్  చెప్పారు.గురువారంనాడు  గజ్వేల్ లో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావంలో  మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  గజ్వేల్ నియోజకవర్గంలోని పర్గల్ లో తాను ఫౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకొని తన  వ్యాపార జీవితాన్ని ప్రారంభించుకున్న విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేసుకున్నారు.

గజ్వేల్ కు తాను కొత్త కాదని ఆయన పేర్కొన్నారు. స్వంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్ సూచిస్తే హుజూరాబాద్ లో ఉద్యమం నడిపినట్టుగా  రాజేందర్ ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో తాను ఎక్కువగా గజ్వేల్ లోనే తిరిగేవాడినని ఆయన  చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏమిటో  ప్రజలకు తెలుసునన్నారు.ఎమ్మెల్యే అయ్యాక తెలంగాణతో పాటు అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినట్టుగా రాజేందర్ చెప్పారు.

2017లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే  1700 మందిని ఉద్యోగంలో నుండి తొలగించారని రాజేందర్ తెలిపారు.ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడ కేసీఆర్ కు కనికరం లేదన్నారు.సమ్మె చేస్తే వారిని బ్రహ్మదేవుడు కూడ కాపాడలేరని కేసీఆర్  చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. 

గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా  ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.  గజ్వేల్ నుండి  కేసీఆర్  బీఆర్ఎస్ అభ్యర్ధిగా మరోసారి పోటీ చేస్తున్నారు.  గజ్వేల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేస్తున్నారు.  కేసీఆర్ పై పోటీ చేస్తానని  ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే   గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కూడ ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుండి ఈటల రాజేందర్ కు బీజేపీ టిక్కెట్లను కేటాయించింది.ఈ నెల  22న బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 

also read:జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో కమలం, తెలంగాణలో టీడీపీ దూరం

పేదల భూములను ఆక్రమించారనే ఆరోపణలతో ఈటల రాజేందన్ ను బీఆర్ఎస్ నుండి  ఆ పార్టీ బహిష్కరించింది.  మంత్రి వర్గం నుండి కూడ ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు.  ఈ పరిణామాలతో  బీఆర్ఎస్ ను వీడి  బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో  జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా  బరిలోకి దిగి ఈటల రాజేందర్ విజయం సాధించారు. బీజేపీ నాయకత్వం  ఈటల రాజేందర్ కు  పార్టీలో ప్రాధాన్యత ఇస్తుంది.  బీజేపీ ఎన్నికల  కమిటీకి ఈటల రాజేందర్ ను  చైర్మెన్ గా ఆ పార్టీ నియమించింది. 

 

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios