పతనం ప్రారంభమైంది: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ కౌంటర్


వరి ధాన్యం కొనుగోలు విషయంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై కేసీఆర్ నెపం నెడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో కేంద్రంపై కేసీఆర్ చేసిన విమర్శలకు ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.
 

Former minister Etela Rajender reacts to Kcr Comments

హైదరాబాద్: కేసీఆర్ పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి , హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.గురువారం నాడు హైద్రాబాద్‌ బీజేపీ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో కేంద్రంపై సీఎం చేసి విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.కేసీఆర్ అనాలోచిత విధానాల కారణంగానే రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందన్నారు.

అన్నీ తనకు తెలుసుననే అహంకారపూరితంగా kcr వ్యవహరిస్తున్నారని Etela Rajender విమర్శించారు.40 రోజులుగా రాష్ట్రంలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ఈటల రాజేందర్. Paddy ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ధాన్యం రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే  ధాన్యం మొలకెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రైతులకు వచ్చిన కష్టానికి కేసీఆర్ బాధ్యుడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు.  ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకొన్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని అసెంబ్లీలో కూడా సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరిస్తుందనే విషయాన్ని ఏనాడూ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదన్నారు. ధాన్యం కొనుగోలు కోసం గన్నీ బ్యాగుల నుండి ప్రతిదీ కేంద్రం చూసుకొంటుందన్నారు. 

also read:ముఖ్యమంత్రి సినిమా ఫ్లాప్ అయింది.. కేసీఆర్ కు రాజాసింగ్ కౌంటర్..

ఒకసారి సన్న వడ్లు, మరోసారి పత్తి, పండించవద్దని కేసీఆర్ చేసిన ప్రకటనలను  ఈటల రాజేందర్ గుర్తు చేశారు. బాయిల్డ్ రైస్  కొనుగోలును కేంద్రం ఎప్పుడైనా నిలిపివేస్తోందని మిల్లర్లు సీఎం కు చెప్పారన్నారు.  మిల్లర్లు, రైతుల సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని ఈటల రాజేందర్ విమర్శించారు.తన వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నాన్ని కేసీఆర్ సర్కార్ చేస్తోందని ఈటల రాజేందర్ తెలిపారు.

రైతులకు రైతు బంధు పథకాన్ని ఇచ్చి ఇతర పథకాలను రద్దు చేశారన్నారు. కేసీఆర్ రైతు ద్వేషి అని ఈటల రాజేందర్ విమర్శించారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ సర్కార్ రైతుల కోసం  డబ్బులు ఖర్చు చేయలేదా అని  ఈటల రాజేందర్ ప్రశ్నించారు.రైతుల సంక్షేమం కోసం పాటు పడాలని ఆయన కేసీఆర్ ను కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు వరి అంశాన్ని తెర మీదికి తెచ్చారని రాజేందర్ విమర్శించారు.

వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హైద్రాబాద్ ఇందిరా పార్క్ లో కేసీఆర్ సహా  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా మహా ధర్నా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios