Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్‌లో ఏం జరుగుతుందో బీజేపీ గమనిస్తోంది: ఈటల సంచలనం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా చూడాలని ఈటల రాజేందర్ కోరారు. నిర్మల్ లో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. 

former minister Etela Rajender comments on KCR
Author
Karimnagar, First Published Sep 17, 2021, 4:41 PM IST

నిర్మల్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా చూడాలని తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి ఆయన ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.

హుజురాబాద్ గడ్డ మీద మీ అధికార అహంకారానికి ఘోరీ కట్టడం తథమన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాల విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో మీరంతా గమనిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. 

తెలంగాణ ప్రజలందరూ కూడా హుజురాబాద్లో ఏం జరగబోతుంది అని ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.అందరూ ఒకటే నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హుజూరాబాద్  ప్రజలకు సంఘీభావంగా అందరూ సిద్ధంగా ఉన్నారని రాజేందర్ తెలిపారు.

భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ 303 ఎంపీలు ఉన్న 18  రాష్ట్రాల్లో అధికారంతో పరిపాలిస్తున్న పార్టీ  హుజురాబాద్ లో జరుగుతున్నవి అన్నీ బిజెపి గమనిస్తోందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇంటికి ఒకరు చొప్పున హుజురాబాద్ వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని ఈటల రాజేందర్ కోరారు.

also read:విమోచన దినోత్సవం .. కేసీఆర్ ఎవరికో భయపడుతున్నారు, మజ్లిస్‌కు బీజేపీ భయపడదు : అమిత్ షా

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అసెంబ్లీ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం  దుర్దినమన్నారు. 

ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మరోసారి డిమాండ్ చేస్తున్నానని ఆయన చెప్పారు.రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జండా కాషాయ జెండానే అని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.2023 లో భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో విజయదుందుభి మోగించి సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios