హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడకూడదని  ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డికి
సూచించానని మాజీ మంత్రి డికె అరుణ చెప్పారు.


గురువారం నాడు ఆమె హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారే విషయంలో
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని దామోదర్ రెడ్డికి తాను సూచించినట్టు డికె అరుణ
చెప్పారు.

ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని కూడ తాను దామోదర్ రెడ్డికి సూచించినట్టు ఆమె
తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని  దామోదర్ రెడ్డికి తాను సలహా ఇచ్చినట్టు ఆమె
చెప్పారు.నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనే అంశం దామోదర్ రెడ్డితో
చర్చించలేదని ఆయన తీవ్రంగా మధనపడుతున్నాడని ఆయన చెప్పారు.

దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరితే తనకు వ్యక్తిగతంగా నష్టమేమీ
లేదని ఆమె చెప్పారు. రాజకీయంగా తనను ఇబ్బందిపెడితే తనకు ఎలాంటి నష్టం లేదని
డికె అరుణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే నష్టపోతోందని ఆమె పరోక్షంగా  పార్టీలోని
తనప్రత్యర్ధులనుహెచ్చరించారు. పార్టీని కాపాడుకోవడమే తన ధ్యేయమని ఆమె చెప్పారు.
అంతేకాదు తనను తాను రక్షించుకొంటానని ఆయన చెప్పారు.