Asianet News TeluguAsianet News Telugu

రేవంత్, భట్టి ఎఐసీసీ నేతల భేటీ రద్దు: రేపు ఢిల్లీ నుండి డీఎస్ హైద్రాబాద్ రాక

ఎఐసీసీ నేతలతో భట్టి, రేవంత్ భేటీ రద్దు.. ఢిల్లీ నుండి రేపు డీఎస్ హైద్రాబాద్ కు రాక...ఢి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలతో చర్చించే విషయమై రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల సమావేశం ఇవాళ రద్దైంది. డీఎస్ ఢిల్లీ నుండి రేపు హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. 

Former minister D. Srinivas Retrun to Hyderabad From Delhi tomorrow
Author
Hyderabad, First Published Dec 17, 2021, 12:20 PM IST

హైదరాబాద్: డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఎఐసీసీ పెద్దలతో టీపీసీసీ చీఫ్ Revanth Reddy, సీఎల్పీ నేత Mallubhatti Vikramarka ల భేటీ రద్దైంది. D.Srinivas పార్టీలో చేరే విషయమై చర్చించేందుకు ఈ  ఇద్దరు నేతలకు Aicc నుండి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ అధినేత్రి Sonia Gandhi తో డీఎస్ గురువారం నాడు భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై రాష్ట్ర నాయకత్వానికి ఎఐసీసీ పెద్దలు సమాచారం పంపారు. ఈ విషయమై చర్చించేందుకు Delhiలో అందుబాటులో ఉండాలని ఆహ్వానం పంపారు. అయితే  కొన్ని కారణాలతో ఈ సమావేశం రద్దైంది. 

also read:కాంగ్రెస్‌ గూటికి డీఎస్: నేడు ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్, మల్లు

మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ శనివారం నాడు ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. హైద్రాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత అనుచరులతో డి.శ్రీనివాస్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై తన అనుచరులకు డీఎస్ సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.  
మరో వైపు డీఎస్ Congress పార్టీలో చేరే విషయమై ఆ పార్టీకి చెందిన నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ కష్ట కాలంలో పార్టీని వీడిన డీఎస్ ను తిరిగి పార్టీలో చేర్చుకొనే విషయమై కొందరు నేతలు సుముఖంగా లేరనే ప్రచారం సాగుతుంది. అయితే మరికొందరు నేతలు మాత్రం డీఎస్ ను పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. డీఎస్ పార్టీలో చేరే విషయమై రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించి అధిష్టానానికి సమాచారం ఇవ్వనుంది. . 
.

Follow Us:
Download App:
  • android
  • ios