మెదక్: మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి సోమవారం నాడు ఉదయం కన్నుమూశారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలో ఆయన పనిచేశారు. సుధీర్ఘకాలం పాటు ఆయన టీడీపీలో పనిచేశారు. మంత్రిగా ఉన్న కూడ ఆయన రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో చెరుకు ముత్యం రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా పనిచేశారు. హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.


గత ఏడాది నవంబర్ మాసంలో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. విదేశాల్లో ఆయన చికిత్స కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం సహాయనిధి నుండి నిధులను మంజూరు చేశారు. అమెరికాలో చికిత్స చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడింది. 

కానీ, కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితులు అంతగా బాగా లేవు. ఈ పరిస్థితుల్లో ఆయనను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు.