బుజ్జగింపులు: ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య భేటీ


మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య బుధవారం నాడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని ప్రదీప్ రావును సారయ్య కోరారు. తన డిమాండ్లను సారయ్య ముందుంచారు ప్రదీప్ రావు. ఈ డిమాండ్లను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని సారయ్య హామీ ఇచ్చారు. 
 

Former Minister Basavaraju Saraiah Meets Errabelli Pradeep Rao

వరంగల్: Errabelli Pradeep Raoను పార్టీ వీడొద్దని TRS నాయకత్వం బుజ్జగింపులకు దిగింది.  ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్టీలో  తనక ప్రాధాన్యత లేదని ప్రదీప్ రావు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీని వీడాలని భావిస్తున్నారు. పార్టీ వీడాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తన అనుచరులుతో ప్రదీప్ రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ప్రదీప్ రావును పార్టీని వీడొద్దని TRS నాయకత్వం బుజ్జగిస్తుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ Basavaraju Saraiah ప్రదీప్ రావుతో బుధవారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి Errabelli  Dayakar Rao సోదరుడే ప్రదీప్ రావు.  ప్రదీప్ రావు MLC పదవిని ఆశించాడు. ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్  కోటాలో ప్రదీప్ రావుకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని భావించారు.

అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం  ఇతరులకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. ఇక టీఆర్ఎస్ లో తనకు న్యాయం జరగదనే అభిప్రాయంతో ప్రదీప్ రావు ఉన్నారని ఆయన అనుచరులు  చెబుతున్నారు.ఈ  తరుణంలో ప్రదీప్ రావు పార్టీని వీడాలని భావిస్తున్నారని సమాచారం. దీంతో ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు టీఆర్ఎస్ నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఇవాళ ప్రదీప్ రావుతో భేటీ అయ్యారు. 

తన డిమాండ్లను మాజీ మంత్రి బస్వరాజు సారయ్య దృష్టికి తీసుకెళ్లారు ప్రదీప్ రావు. ఈ డిమాండ్లను పార్టీ నాయకత్వానికి వివరిస్తానని బస్వరాజ్ సారయ్య ప్రదీప్  రావుకు హామీ ఇచ్చారు. ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది.ఈ నెల 7వ తేదీన ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ప్రదీప్ రావును తొందరపడవద్దని గులాబీ నేతలు చెబుతున్నారు.

ప్రదీప్ రావుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంతో  కలిసి ఉంటుంది. రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్న  కాలంలో  ప్రదీప్ రావుతో మంచి సంబంధాలున్నాయని ఆయన  అనుచరులు చెబుతున్నారు. బీజేపీలో చేరికల కమిటీకి ఈటల రాజేందర్ చైర్మెన్ గా కొనసాగుతున్నారు.

also read:మంత్రి దయాకర్ రావు ఇంట్లో కలకలం.. టీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు..?

ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను కూడా అందిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు.  రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios