గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని కపిల్ దేవ్ కోరారు. డిసెంబర్ నెలలో జరగనున్న గోల్ఫ్ టోర్నమెంట్ కు ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కోరారు. గోల్ఫ్ టోర్నమెంట్ కు ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ మామీ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని కపిల్ దేవ్ కోరారు. డిసెంబర్ నెలలో జరగనున్న గోల్ఫ్ టోర్నమెంట్ కు ప్రభుత్వం తరపున సహకారం అందించాలని కోరారు. గోల్ఫ్ టోర్నమెంట్ కు ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ మామీ ఇచ్చారు.

గోల్ఫ్ టోర్నమెంట్ తోపాటు రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, క్రీడారంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, క్రీడారంగంలో రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారుల ప్రతిభ వంటి అంశాలను కేటీఆర్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు వివరించారు. క్రీడారంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కపిల్ దేవ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు ఉన్నారు. అంతకుముందు నగరంలో జంక్షన్ల అభివృద్ధి, స్కై వాక్స్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ట్రాఫిక్ సిగ్నల్స్, బస్ షెల్టర్ల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై కేటీఆర్ అధికారులతో చర్చించారు.