మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య పరువు హత్య కాదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని భువనగిరి ఏసీపీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రామకృష్ణ హత్య కేసులో నిందితులను కోర్టులో హాజరుపర్చామన్నారు.
భువనగిరి: తనను మోసగించి తన బిడ్డను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆస్తిలో వాటా కోసం కూడా కోర్టులో కేసు వేస్తానని బెదిరించడంతోనే Ramakrishna ను హత్య చేయించాలని Lateef కు Venkatesh సుపారీ ఇచ్చాడని భువనగిరి ఏసీపీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
సోమవారం నాడు Bhuvanagiri పోలీస్ స్టేషన్ లో Saireddy Venkat Reddy మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ హత్య కేసుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఇది పరువు హత్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హోంగార్డుగా పనిచేసే సమయంలో రామకృష్ణ వెంకటేష్ ఇంటికి సమీపంలోనే నివాసం ఉండేవాడు. వెంకటేష్ ఇంటికి రామకృష్ణ తరచు వెళ్లేవాడన్నారు.ఈ సమయంలోనే వెంకటేష్త కూతురు Bhargavi తో రామకృష్ణకు పరిచయం ఏర్పడిందన్నారు.ఈ పరిచయం ప్రేమగా మారిందని ఏసీపీ చెప్పారు. దీంతో రామకృష్ణ భార్గవిని ఇంటి నుండి తీసుకెళ్లి వివాహం చేసుకొన్నాడని ఏసీపీ చెప్పారు. అయితే తనను మోసం చేసి తన బిడ్డను పెళ్లి చేసుకొన్నందుకు రామకృష్ణపై వెంకటేష్ కక్ష పెంచుకొన్నాడన్నారు. ఆరు మాసాల క్రితమే రామకృష్ణను చంపేందుకు లతీఫ్ గ్యాంగ్ కు వెంకటేష్ రూ. 10 లక్షలు సుఫారీ ఇచ్చాడన్నారు. అయితే అదే సమయంలో భార్గవికి కూతురు పుట్టిందని తెలుసుకున్న వెంకటేష్ రామకృష్ణను చంపే విషయమై సుఫారీ గ్యాంగ్ పై ఒత్తిడి తీసుకురాలేదు. అయితే ఇటీవల కాలంలో భార్గవికి దక్కాల్సిన ఆస్తి విషయమై రామకృష్ణ వెంకటేష్ ను బెదిరించాడు. దీంతో రామకృష్ణను హత్య చేయాలని లతీప్ గ్యాంగ్ పై వెంకటేష్ ఒత్తిడి చేశారని పోలీసులు చెప్పారు. రామకృష్ణను హత్య చేసేందుకు లతీప్ గ్యాంగ్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి ఒప్పుకొన్నారని పోలీసులు వివరించారు.
రామకృష్ణ తో అమృతయ్య రియల్ ఏస్టేట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడు. అయితే రామకృష్ణ కన్పించకుండా పోయాడని భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతయ్యను విచారిస్తే హత్య చేశారని ఏసీపీ తెలిపారు. రామకృష్ణను హత్య చేసిన విషయాన్ని బయటకు చెబితే రామకృష్ణకు పట్టిన గతే పడుతుందని లతీఫ్ గ్యాంగ్ హెచ్చరించడంతో అమృతయ్య నోరు వెదపలేదన్నారు. అమృతయ్యను విచారిస్తే రామకృష్ణను హత్య చేశారని తమకు తెలిపాడన్నారు. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా లతీఫ్ గ్యాంగ్ ను పట్టుకొని విచారణ చేస్తే అసలు విషయం తేలిందన్నారు. రామకృష్ణను చంపిన తర్వాత సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టారన్నారు.
ఈ కేసులో భార్గవి తండ్రి వెంకటేష్ ను ఏ1గా చేర్చారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేసే యాదగిరిని ఏ2 గా చేర్చారు. ఏ3గా డి. రాములు, ఏ4 గా సయ్యద్ లతీఫ్, ఏ5 గా గోలి దివ్య, ఏ6 గా మహమ్మద్ అఫ్సర్, ఏ7 గా పొలస మహేష్, ఏ8 గా, మహమ్మద్ సిద్దిఖ్, ఏ9గా తొట్ల ధనలక్ష్మి, ఏ10 గా నరేందర్ , ఏ11 గా తొట్ల భాను ప్రకాష్ లను చేర్చినట్టుగా భువనగిరి ఏసీపీ వివరించారు.
ఇవాళ నలుగరు నిందితులను కోర్టులో హాజరుపర్చామని భువగిరి ఏసీపీ చెప్పారు. కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధఇంచినట్టుగా ఏసీపీ తెలిపింది. మిగిలిన నిందితులను కూడా రేపు కోర్టులో హాజరు పరుస్తామని ఏసీపీ చెప్పారు.
