హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాజీ మేయర్  బండ కార్తీక మంగళవారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు బండి సంజయ్ తో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  చేసి ఆమె గురువారం నాడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది షాక్ ను గురి చేసింది.

 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసిన బండ కార్తీక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆమె బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆమె భేటీ అయ్యారు.

2009 నుండి 2012 వరకు ఆమె జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్టును ఆమెకు ఇవ్వలేదు. దీంతో ఆమె అసంతృప్తితో ఉంది.

also read:కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బండ కార్తీక ?

బండి సంజయ్ తో భర్త చంద్రారెడ్డితో కలిసి బండ కార్తీక ఇవాళ సమావేశమయ్యారు. గురువారం నాడు బీజేపీ జీహెచ్ఎంసీ ఇంచార్జీ భూపేంద్రసింగ్ యాదవ్ సమక్షంలో బండ కార్తీక బీజేపీలో చేరనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కాంగ్రెస్ కు ఈ సమయంలో బండ కార్తీక పార్టీ నుండి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా నష్టమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.