తెలంగాణ మంత్రి ఈటలను కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ గురువారం కలిశారు. పాతబస్తీలో ఉన్న ప్రముఖ ఆయుర్వేద హాస్పిటల్, కళాశాలను తెలంగాణ ప్రభుత్వం ఎర్రగడ్డకు తరలిస్తోంది. కాగా... ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  దత్తాత్రేయ మంత్రి ఈటలను కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ హాస్పిటల్ కి చికిత్స కోసం ప్రజలు వస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికిప్పుడు ఆ హాస్పిటల్ ని అక్కడి నుంచి మారిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. అందుకే తన వినపాన్ని బీజేపీ తరపున మంత్రి ఈటలకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్, హోమియో, ఆయులకు నిధులు కేటాయిస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కేంద్రం నుంచి తెలంగాణకి భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు. 32 జిల్లా కేంద్రాలలో ఆయుష్ హాస్పిటల్స్ ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సికింద్రాబాద్ లో ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు చెప్పారు.