Asianet News TeluguAsianet News Telugu

మా భూములే ఆక్రమించాడు.. అన్నా... మీరే న్యాయం చెప్పండి !.. అఖిల ప్రియ

కిడ్నాప్ కేసులో అరెస్టైన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో పోలీసులు కస్టడీ ముగిసింది. ఈ విచారణలో ఆమె చాలా వరకు మౌనంగానే ఉంది. పక్కా ఆధారాలను చూపుతూ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు దర్యాప్తు అధికారులను ‘అన్నా’ అని సంబోధించినట్లు తెలిసింది. 

Former Andhra Minister Akhila Priya about Kidnapping Over Land Dispute in Police Custody - bsb
Author
Hyderabad, First Published Jan 16, 2021, 9:14 AM IST

కిడ్నాప్ కేసులో అరెస్టైన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో పోలీసులు కస్టడీ ముగిసింది. ఈ విచారణలో ఆమె చాలా వరకు మౌనంగానే ఉంది. పక్కా ఆధారాలను చూపుతూ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆమె బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు దర్యాప్తు అధికారులను ‘అన్నా’ అని సంబోధించినట్లు తెలిసింది. 

భూ వివాదం గురించి మాట్లాడుతూ ‘‘మా భూములను ప్రవీణ్‌రావు ఆక్రమించాడు. మాకు అన్యాయం జరిగింది. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఇరికించారు. కానీ ఈ కిడ్నాప్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీసులకు చెప్పారు. మూడు రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బేగంపేట మహిళా ఠాణాలో విచారించిన విషయం తెలిసిందే. 

‘‘మా నాన్నకు(భూమా నాగిరెడ్డి) హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లో 33 ఎకరాల భూమి ఉంది. ఏవీ సుబ్బారెడ్డి ఆ భూములను పర్యవేక్షించేవాడు. 2005 నుంచి ఆ భూముల విషయంలో మా నాన్నకు కృష్ణారావు అనే న్యాయవాది సలహాదారుగా ఉండేవారు. ఆయన కుమారుడే ప్రవీణ్‌కుమార్‌(ప్రవీణ్‌రావు). కృష్ణారావు మేనల్లుడు సునీల్‌రావు. 

కృష్ణారావు మ రణంతో.. ఆ బాధ్యతలను ప్రవీణ్‌కుమార్‌, సునీల్‌రావు తీసుకున్నారు. ఆ భూముల వెనక ఉన్న న్యాయవివాదాలను ఆసరాగా చేసుకుని.. మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు. వారి నుంచి లబ్ధి పొందిన ఏవీ సుబ్బారెడ్డి పక్కకు తప్పుకొన్నాడు. మా వాటా కోసం పోరాడాను. ప్రవీణ్‌కుమార్‌, సునీల్‌రావుతో చర్చలకు ప్రయత్నించాను’’ అని ఆమె పోలీసులకు వివరించినట్లు తెలిసింది. 

అయితే.. వారి కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పోలీసులతో పదేపదే అన్నట్లు సమాచారం. ‘‘అన్నా (దర్యాప్తు అధికారులను ఉద్దేశించి).. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి’’ అని ఆమె వ్యాఖ్యానించడంతో.. ఏం చేయాలో తెలియక పోలీసులు మౌనముద్ర దాల్చినట్లు తెలిసింది. దీంతో.. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం  ఆమె సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

అఖిలప్రియ పోలీసు కస్టడీ ముగియడంతో.. గురువారం మధ్యాహ్నం ఆమెకు బేగంపేట పాటిగడ్డలోని బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేయించినట్లు తెలిసింది. ఆమెకు నెగటివ్‌ అని తేలడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. గర్భవతిగా ఉన్న అఖిలకు అక్కడ పలు పరీక్షలు నిర్వహించారు. 

ఆ తర్వాత మారేడ్‌పల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై శనివారం విచారణ జరగనుంది. పోలీసు విచారణ పూర్తికావడం, గర్భవతిగా ఉండటాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని, ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios