Asianet News TeluguAsianet News Telugu

ఆయుధాలు ఇవ్వాలి: రేపటి నుండి ఫారెస్ట్ సిబ్బంది విధులు బహిష్కరణ

రేపటి  నుండి  విదులు  బహిష్కరించాలని  ఫారెస్ట్  సిబ్బంది  నిర్ణయం  తీసుకున్నారు.  పోలీసులకు  ఇచ్చినట్టుగానే  తమకు  కూడ తుపాకులు  ఇవ్వాలని కోరుతున్నారు. 

forest  Staff  decides  to  boycott  work
Author
First Published Nov 23, 2022, 2:44 PM IST

హైదరాబాద్: రేపటి నుండి విదులు  బహిష్కరించాలని  ఫారెస్ట్   సిబ్బంది  నిర్ణయం  తీసుకున్నారు. పోలీసుల  మాదిరిగానే  తమకు  కూడా  తుపాకులు  ఇవ్వాలని  పారెస్ట్  సిబ్బంది  డిమాండ్  చేస్తున్నారు. ఖమ్మంలో  గుత్తికోయల  దాడిలో  ఫారెస్ట్  అధికారి  శ్రీనివాస్  మృతి  చెందాడు. దీంతో  ఫారెస్ట్  సిబ్బంది  ఈ నిర్ణయం  తీసుకున్నారు.ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలో గుత్తికోయల  దాడిలో  ఫారెస్ట్  అధికారి  శ్రీనివాస్  నిన్న  మృతి  చెందాడు.  ఇవాళ ఉదయం  శ్రీనివాస్  స్వగ్రామంలో  అంత్యక్రియలు  జరిగాయి. 

చాలా  కాలంగా  తమకు  ఆయుధాలివ్వాలని పారెస్ట్  అధికారులు  డిమాండ్  చేస్తున్నారు. అడవిలో విధులు నిర్వహించాలంటే  ఆయుధాలు కావాలని కోరుతున్నారు.అయితే  ఈ  విషయమై  ప్రభుత్వం నిర్ణయం  తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు  ఏజెన్సీ ప్రాంతాల్లో  ఆదీవాసీలకు , ఫారెస్ట్  సిబ్బంది మధ్య  వివాదాలు  జరుగుతున్నాయి.  నిన్న  కూడా  ఫారెస్ట్  అధికారి  శ్రీనివాసరావుతో  గుత్తికోయలు వాగ్వాదానికి  దిగి  కొడవలితో  దాడి చేశారు.దీంతో  ఆయన  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  మరణిించారు. స్మగ్లర్లు  గతంలో  పారెస్ట్  అధికారులపై  దాడులు  చేసిన ఘటనలు చోటు  చేసుకున్నాయి.  దీంతో ఆయుధాలిచ్చే  విషయమై  చర్చించారు.

ఈ తరహలో  దాడులు  జరిగిన  సమయంలో  అటవీశాఖాధికారులకు  ఆయుధాలిచ్చే  విషయమై చర్చలు   తెరమీదికి  వస్తున్నాయి. తాజాగా  ఖమ్మంలో  శ్రీనివాసరావు మృతితో  మరోసారి  ఆయుధాల  అంశంపై  చర్చ జరుగుతుంది. శ్రీనివాసరావు  మృతితో ఆయుధాలివ్వాలని ఫారెస్ట్  అధికారులు డిమాండ్  చేస్తున్నారు.ఇదే అంశంతో  ఫారెస్ట్  సిబ్బంది  ఆందోళనకు  దిగారు. ఇవాళ  ఖమ్మం  జిల్లాలో  పారెస్ట్  అధికారి  శ్రీనివాసరావు అంత్యక్రియలకు  హాజరైన  సమయంలో పారెస్ట్  ఉద్యోగులు, సిబ్బంది  కూడా  తమకు  ఆయుధాలివ్వాలని  నినాదాలు  చేశారు. ఇదే  డిమాండ్  తో  మంత్రులు  ఇంద్రకరణ్  రెడ్డి , పువ్వాడ అజయ్  వద్ద  అటవీశాఖ  ఉద్యోగులు  ఆందోళనకు  దిగారు.  శ్రీనివాసరావు  అంత్యక్రియలు  జరిగే  సమయంలో  ఇదే  డిమాండ్ తో  ఉద్యోగులు నినాదాలు  చేయడంతో ఉద్రిక్తత  నెలకొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios