Asianet News TeluguAsianet News Telugu

భద్రాద్రిలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడి: మహిళలను బెల్ట్‌తో కొట్టిన అధికారులు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై అటవీశాఖాధికారులు దాడికి దిగారు. గిరిజన మహిళలపై బెల్ట్ లతో దాడికి దిగారు. ఈ దాడితో గిరిజనులు ఈ ప్రాంతం విడిచి పెళ్లిపోయారు. ఆదీవాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడి చేయడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి.

Forest Officers Beaten up Tribes women in Bhadradri kothagudem
Author
Hyderabad, First Published Jun 26, 2022, 4:43 PM IST

ఖమ్మం: Bhadradri kothagudem జిల్లాలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న Tribesపై  అటవీశాఖాధికారులు   ఆదివారం నాడు దాడికి దిగారు. ఈ దాడితో గిరిజనులు ఇతర ప్రాంతానికి వెళ్లారు. గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ లతో దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. 

ఖరీఫ్  సీజన్ ప్రారంభం కావడంతో Chandrugonda మండలం ఎర్రబోడులో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకొంటున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా  ఈ ప్రాంతంలోనే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన గిరిజనులు నివాసం ఉంటున్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు.  దాదాపుగా 15 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పారెస్ట్ అధికారులు, గిరిజన రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. 

చంద్రుగొండ మండలం ఎర్రబోడులో పోడు భూములను గిరిజనులు సాగు చేసుకుంటుననారు.Forest  అధికారులు బెల్ట్ లతో దాడికి దిగారు. ఇవాళ వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులపై అటవీ శాఖాధికారులు Attack చేసినట్టుగా ప్రముఖ న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. గిరిజనులను అటవీశాఖాధికారులు తరిమి తరమి కొట్టారని కూడా ఆ కథనంలో వివరించింది. 

కొందరు గిరిజన మహిళలపై అటవీశాఖాధికారులు  Belt  లతో దాడులకు దిగారని కూడా ఈ న్యూస్ చానెల్ తెలిపింది. ఈ దాడితో గిరిజునులు ఆ ప్రాంతం వదిలివెళ్లారు. పోడు భూములు సాగు చేసుకొంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు పోడు భూములు సాగు చేసుకోకుండా అడ్డు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా గిరిజనులపై అటవీశాఖాధికారులు దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.పోడు భూముల్లో వ్యవసాయం చేయకుండా అటవీశాఖాధికారులు చేసే ప్రయత్నాలను కూడా గిరిజనులు అడ్డుకుంటున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. కొన్ని జిల్లాల్లో అటవీశాఖాధికారులపై గిరిజనులు దాడులకు దిగిన కేసులు కూడా నమోదయ్యాయి.పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు, ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.

పోడు భూముల విషయమై అటవీశాఖాధికారులు, గిరిజనుల మధ్య గతంలో కూడా ఇదే తరహాలో దాడులు జరిగిన ఘటనలు కూడా లేకపోలేదు.ఆదిలాబాద్ జిల్లా  జైలు నుంచి 12 మంది ఆదివాసి మహిళలు బెయిల్‌పై విడుదలయ్యారు. అక్రమంగా తమను అరెస్ట్ చేశారంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమపై అక్రమ కేసులు పెట్టిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమకు భూమి ఆధారమని, పోడు భూములకు పట్టాలని ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీరంతా  పోడు భూముల కేసులో అరెస్ట్ అయ్యారు. జైలు  నుంచి విడుదలైన ఆదివాసి మహిళలకు స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ నెల 6న ఆదిలాబాద్ జైలు నుండి గిరిజన మహిళలు జైలు నుండి  విడుదలయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం జీడిపల్లికి చెందిన లక్ష్మణ్(48) కు ఐదెకరాల పోడు భూమి వుంది. అందులోనే అతడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే పోడు భూములు కలిగిన రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించగా లక్ష్మణ్ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరిట పట్టా వచ్చి ఐదెకరాలు తన సొంతం అవుతుందని భావించాడు. 

కానీ అతడి ఆశలపై అటవీ శాఖ అధికారులు నీళ్లు చల్లారు. అతడి ఐదెకరాల భూమిని అటవీ భూమి గా పరిగణిస్తూ అందులో నీటికుంట నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే భూమిని స్వాధీనం చేసుకుని జేసిబిల సాయంతో నీటికుంట నిర్మాణాన్ని అటవీ అధికారులు చేపట్టారు. దీంతో 2021 డిసెంబర్ 20న లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

నీటి కుంట నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలోనే లక్ష్మణ్ పురుగుల మందుతాగాడు. పక్కనే వున్నవారు దీన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. లక్ష్మణ్ ను బోథ్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో డాక్టర్ల సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్  కు తరలించారు. అక్కడికి వెళ్లేసరికే పరిస్థితి పూర్తిగా విషమించి లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. 

2021 జూలై 29న సత్తుపల్లి మండలం రేగుళ్లపాడులో ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతుల మధ్య  ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఇద్దరు మహిళా ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి.పోడు భూముల్లో వ్యవసాయ పనులు చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకొన్నారు. దీంతో పారెస్ట్ అధికారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా పారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios