హైదరాబాద్: అటవీ భూమిని చదును చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడు జైకుమార్ పై ఫారెస్ట్ అధికారులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని చదును చేసుకొంటుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకొంటున్నారని ఫారెస్ట్ అధికారులపై జైకుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. 
 
తన భూమిని చదును చేసుకోవడాన్ని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు అడ్డుకోవడాన్ని జైకుమార్ తప్పుబట్టారు.  అటవీశాఖాధికారులు  మాత్రం జైకుమార్ వాదనతో ఏకీభవించడం లేదు. తమ భూమిలో జైకుమార్ అడుగుపెడుతున్నారని ఫారెస్ట్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు.