హైదరాబాద్: ఆన్ లైన్ లో ఫుడ్ తెప్పించుకొన్న మహిళకు మొబైల్ ఫోన్ లో ఆశ్లీల సందేశాలు, వీడియోలు పంపి వేధిస్తున్న డెలీవరీ బోయ్ పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైద్రాబాద్ అమీర్‌పేట ఈస్ట్ శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన మహిళ గత నెల 31వ తేదీన మొబైల్ యాప్ లో పుడ్ ఆర్డర్ చేసింది. 

ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలీవరీ బోయ్  తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన డబ్బులను ఆమె గూగుల్ పే ద్వారా చెల్లించింది. ఈ డబ్బులు చెల్లించినట్టుగా స్క్రీన్ షాట్ ను ఆమె అతడికి  పంపింది.

ఈ స్క్రీన్ షాట్ పంపిన మొబైల్ ఫోన్ కు అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపుతున్నాడు.  దీంతో ఆమె ఆ నెంబర్ ను బ్లాక్ చేసింది.  అయితే మరో నెంబర్ తో అతను ఆమెను వేధించాడు. 

ఈ వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డెలీవరీ బోయ్ రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు.