ఖమ్మం బోనకల్లులో ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి: కంటికి తీవ్ర గాయం
రాష్ట్రంలోని పలు జిల్లాలో వీధి కుక్కలు దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వీధి కుక్కలను పట్టుకెళ్లాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బోనకల్లులో ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి కంటికి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం బాధితురాలిని పేరేంట్స్ హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. హైద్రాబాద్ నగరంలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. కంటికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టుగా చిన్నారి పేరేంట్స్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19వ తేదీన హైద్రాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత కూడా వీధి కుక్కల దాడుల ఘటనలు రాష్ట్రంలో నమోదౌతూనే ఉన్నాయి.
హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ మారుతీనగర్ లో ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారుడు గమనించి కుక్కలను తరిమివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని హస్టల్ లో సుమన్ అనే విద్యార్ధిపై కుక్కలు దాడి చేశాయి. ఇదే జిల్లాలోని మల్లారెడ్డి గ్రామయంలో యేసయ్య అనే వ్యక్తిని వీధి కుక్కలు తరిమాయి. కుక్కలను తప్పించుకొనేందుకు ప్రయత్నించిన యేసయ్య బైక్ పై నుండి పడి తీవ్రంగా గాయపడ్డారు. హైద్రాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో ఐదుగురిపై వీధికుక్కలు దాడి చేశాయి.