అరెస్టైన నిందితుడి డెబిట్ కార్డు ద్వారా రూ. 5 లక్షలు స్వాహా: సీఐపై నిందితుడి అనుమానం
దొంగతనం కేసులో అరెస్టైన నిందితుడి నుండి సీజ్ చేసిన డెబిట్ కార్డు నుండి రూ. 5 లక్షలు మాయమయ్యాయి.ఈ ఘటనపై బాధితుడు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో అంతర్గత విచారణకు సీపీ ఆదేశించారు.
హైదరాబాద్: దొంగతనం కేసులో అరెస్టైన నిందితుడి నుండి సీజ్ చేసిన డెబిట్ కార్డు నుండి రూ. 5 లక్షలు స్వాహా అయ్యాయి. బెయిల్ పై జైలు నుండి విడుదలైన నిందితుడు తన బ్యాంకు ఖాతా నుండి రూ. 5 లక్షలు మాయం కావడంపై బ్యాంకు అధికారులను ఆరా తీశారు. అయితే పలు బ్యాంకు ఏటీఎంల నుండి ఈ డబ్బులను డ్రా చేసినట్టుగా గుర్తించారు. సీజ్ చేసిన బ్యాంకు డెబిట్ కార్డు నుండి డబ్బులు ఎలా మాయమయ్యాయనే దానిపై నిందితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అగర్వాల్ అనే వ్యక్తిని చోరీ కేసులో Rachakonda Commissionerate కి చెందిన CCS పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో Agarwal నుండి Debit కార్డును కూడా సీజ్ చేశారు. నిందితుడికి Bail లభించింది. బెయిల్ లభించడంతో జైలు నుండి విడుదలైన అగర్వాల్ తన బ్యాంకు ఖాతా నుండి రూ. 5లక్షలు మాయం కావడంపై బ్యాంకులో ఆరా తీశారు. ఏఏ ATM ల నుండి డబ్బులు డ్రా చేశారనే వివరాలను కూడా తీసుకున్నారు. సీజ్ చేసిన డెబిట్ కార్డు నుండి డబ్బులు ఎలా మాయమయ్యాయని నిందితుడు ప్రశ్నిస్తున్నారు. సీసీఎస్ లో CIపై నిందితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై రాచకొండ సీపీ Mahesh Bhagwat కి ఫిర్యాదు చేశాడు. ఈ పిర్యాదు ఆధారంగా సీపీ మహేష్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు.