పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద ఇవాళ  ప్రమాదం  జరిగింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను  కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ ను కారు ఢీకొంది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణీస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న తర్వాత కారులోని నుండి ప్రయాణీకులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టారు. కారులోని ఐదుగురిని బయటకు తీశారు. కారులో ఉన్న ఐదుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు అదుపుతప్పి ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొనడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.