హైదరాబాద్: హయత్‌నగర్‌ మండలం మునగనూరులో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. నూతన గృహ ప్రవేశం సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

హయత్‌నగర్  మండలం మునగనూరులో శుక్రవారం నాడు  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కొత్తగా నిర్మించిన ఇంట్లో గృహ ప్రవేశం సందర్భంగా గ్యాస్ సిలిండర్ లీకైంది. దీంతో మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ఐదుగురికి గాయపడ్డారు, గాయపడినవారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు.

గ్యాస్ లీకు కావడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అగ్నిమాపక సిబ్బంది లీకు అవుతున్న గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లో నుండి బయట వేశారు.గ్యాస్ లీకు కావడానికి గల కారణాలు ఏమిటనే  విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండర్ నుండి  గ్యాస్ లీకు ఎలా అయిందనే విషయమై ఆరా తీస్తున్నారు.