తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందరి జీవితాలనో అంధకారంలోకి నెట్టేశాయి. రాజకీయవేత్తలు అయితే పర్వాలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అనుకుని సర్దుకుపోతారు. తరువాత ఎన్నికలకు రెడీ అవుతుంటారు.  

కానీ ప్రజా కూటమి పుణ్యమా అంటూ నలుగురు ఉద్యమకారులు ఆగమాగం అయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమికి మద్దతు ఇచ్చారు నలుగురు ఉద్యమకారులు. తీరా ప్రజాకూటమి ఘోరంగా చతికిలపడటంతో వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. 

గద్దర్ ఈయనను ప్రజలు ప్రజా యుద్ధనౌకగా ముద్దుగా పిలుచుకుంటారు. ప్రజాస్వామ్యంలో గద్దర్ ఏనాడు ఓటు హక్కును వినియోగించుకోలేదు. రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉండే గద్దర్ ఈసారి మాత్రం హుషారుగా పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. మేడ్చల్ లో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని కలిశారు. 

                     

టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సైతం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పొట్టలో తలపెట్టడం గద్దర్ చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చంద్రబాబును పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రక్షకుడు అని కీర్తించారు కూడా. 

గద్దర్ చంద్రబాబునాయుడు పొట్టలో తలపెట్టి కౌగిలించుకోవడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తన శరీరంలోకి బుల్లెట్లను దింపించిన చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన పొట్టలో తలపెట్టి తన స్థాయి దిగజార్చుకున్నారంటూ మండిపడ్డారు. 

               

 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సైతం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పొట్టలో తలపెట్టడం గద్దర్ చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చంద్రబాబును పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రక్షకుడు అని కీర్తించారు కూడా. 

గద్దర్ చంద్రబాబునాయుడు పొట్టలో తలపెట్టి కౌగిలించుకోవడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తన శరీరంలోకి బుల్లెట్లను దింపించిన చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన పొట్టలో తలపెట్టి తన స్థాయి దిగజార్చుకున్నారంటూ మండిపడ్డారు. 

                   

 

ఇకపోతే లగడపాటి రాజగోపాల్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం దెబ్బతో రాజకీయ సన్యాసం తీసుకున్న ఆయన సర్వేల పేరుతో మరోసారి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచిన ఆయన తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ తో తన విశ్వసనీయతను కోల్పోయారని చెప్పాలి. 

లగడపాటి రాజగోపాల్ కావాలనే ఫలితాల పేరుతో హల్ చల్ చేశారంటూ టీఆర్ఎస్ నేతలు సైతం ఆరోపించారు. ప్రజాకూటమి గెలుస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పమంటే లగడపాటి చెప్పారంటూ ఆనాడు కేటీఆర్, కేసీఆర్ హరీష్ రావులు ఆరోపించారు. 

లగడపాటి ఈ దెబ్బతో సర్వే సన్యాసం తీసుకోవాల్సిందేనంటూ కేటీఆర్ కౌంటర్లు కూడా ఇచ్చారు. అలానే జరిగింది. లగడపాటి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కు వచ్చిన ఫలితాలకు అసలు సంబంధం లేదు. దీంతో లగడపాటి రాజగోపాల్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

            

నందమూరి సుహాసిని ఈమె అంతగా ఎవరికి తెలియదు ఒకవేళ తెలిసినా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తెగా అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏనాడు మీడియా ముందుకు కానీ బయటకు రాని ఆమె చంద్రబాబు నాయుడు పుణ్యమా అంటూ కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆనాడు కనిపించిన ఈమె మళ్లీ ఎక్కడా కనిపించలేదు. 

ఇకపోతే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మాదిగ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రజాకూటమితో కలవడం వల్ల ఆయన కూడా చాలా కోల్పోయారని ప్రచారం జరుగుతుంది. ఉద్యమకారుడిగా ఆయనకు ఉన్న పేరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పోయిందని విమర్శలు వస్తున్నాయి.  

                 

మరోవైపు బీసీ నేత ఆర్ కృష్ణయ్య పరిస్థితి కూడా అంతే. బీసీ ఉద్యమకారుడిగా ఆయనకు విపరీతమైన పేరు ఉంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి మాత్రం బొక్క బోర్లాపడ్డారు. గతంలో ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి నల్గొండ జిల్లా మిర్యాల గూడ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  

ఆనాడు టీడీపీ తరపున పోటీ చెయ్యగా ఈసారి మాత్రం  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే కారు జోరుకు ఆర్ కృష్ణయ్య సైతం ఫెడ్ అవుట్ అయ్యారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొంతమంది బీసీ నేతలు అడ్డు చెప్పారు. గెలిచిన తర్వాత ఆర్ కృష్ణయ్య వారిని శాంతింపజేశారు. 

తాజాగా చంద్రబాబు నాయుడు దెబ్బతో ఈయన కూడా అవుట్ అయ్యారు. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య పరిస్థితి ఏంటన్నదానిపై సందేహం నెలకొంది. ఇలా చంద్రబాబు నాయుడు దెబ్బకు ఐదుగురు ఉద్దండులు బలయ్యారంటూ ప్రచారం జరుగుతుంది.