వాషింగ్టన్: అమెరికాలో మరో హైద్రాబాద్‌పై కాల్పులు జరిగాయి. హైద్రాబాద్ కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముజీబుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

 ముజీబుద్దీన్ ను షికాగోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల విషయాన్ని హైద్రాబాద్ లోని ఆయన కుటుంబానికి సమాచారం అందించారు

 ముజీబుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్లకు లేఖ రాశారు.  ముజీబ్ పై కాల్పులు జరిపిన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముజీబ్ పై ఎవరు కాల్పులు జరిపారు,. ఎందుకు జరిపారనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.

బాధితుడిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూడ ఆ లేఖలో కోరారు. ఇటీవలనే చంచల్‌గూడకు చెందిన సిరాజ్ పైనా అమెరికాలో కాల్పులు జరిగాయి. కారులో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘట నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డాడు.