బస్సు దిగమన్నందుకు ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన హైద్రాబాద్ పంజగుట్టలో చోటు చేసుకొంది 

బస్సు దిగమన్నందుకు ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన హైద్రాబాద్ పంజగుట్టలో చోటు చేసుకొంది

బస్సులో ప్రయాణీకుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. గన్ నుండి వెలువడిన బుల్లెట్ బస్సు టాప్ నుండి బయటకు వెళ్లింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.


47 ఎల్ నెంబర్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకొంది. బస్సు దిగాలని కోరినందుకు ఇద్దరు ప్రయాణీకుల మధ్య ఈ గొడవ చోటు చేసుకొంది. బస్సు దిగకుండా ఓ ప్రయాణీకుడు తన జేబులోని తుపాకీని తీసుకొని కాల్పులకు దిగాడు. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యాడు.

పంజగుట్టలోని హిమాలయ బుక్ సెంటర్ వద్ద బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కాల్పులకు దిగిన ప్రయాణీకుడు అదే బస్సులో కొండాపూర్ వద్దకు వెళ్లాడు. కాల్పులకు దిగిన వ్యక్తితో గొడవకు దిగిన వ్యక్తి సాగర్ సోసైటీ వద్ద బస్సు దిగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎవరూ కూడ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

ఏపీ 28 జడ్ 4468 నెంబర్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకొంది. ఇంత గొడవ చోటు చేసుకొన్నా కూడ డ్రైవర్ బస్సును ఆపకుండా తీసుకెళ్లాడు. కాల్పులకు దిగిన వ్యక్తితో గొడవపడిన వ్యక్తి ఓ ఛానెల్‌లో కెమెరామెన్‌గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది.