హైదరాబాదు నుండి రాయచూరుకి అక్సిజన్ ని తరలిస్తుండగా పెద్దజిల్లా జిల్లా చీకురాయి వద్దనున్న.. 38 వ రైల్వే గేట్ వద్ద అక్సిజన్ ట్యాంకర్ లో స్వల్పంగా  మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయ్యిన రైల్వే సిబ్బంది గూడ్స్ బండిని ఆపి మంటలని ఆర్పివేసారు.

"

చిన్నగా అక్సిజన్ ట్యాంకర్ లీకేజి ఏర్పడం వల్ల ఎండవేడిమికి స్వల్పంగా మంటలు వచ్చాయని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తం అయ్యిన రైల్వే సిబ్బంది ఆ లైన్ లో విద్యుత్ సరఫరాని నిలిపివేసారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడం తో మొత్తానికి పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.