హైదరాబాద్ తార్నాక మెట్రో స్టేషన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంటలలో కార్ పూర్తిగా దగ్ధమయ్యింది. కారు పేలుతుందేమో అనే భయంతో భారీగాట్రాఫిక్ జామ్ అయ్యింది. 

"

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా మంటల్లో కారు పూర్తిగా దగ్థమై పోయింది. అయితే కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పేయడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.