హైదరాబాద్: గాంధీ నగర్ పరిధిలోని ఒక అక్రమ స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుఝామున 3గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇండ్ల మధ్య ఈ గోడౌన్ ఉండడం కరెక్ట్ కాదని గతంలో కూడా చాల సార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులెవరూ చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. 

అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది దాదాపుగా 5గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పగలిగామని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఇలా ఇండ్ల మధ్య అక్రమ గోడౌన్ ఉండడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 

రకరకాల సామాన్లు పేపర్ల నుంచి మొదలుకొని పాత మెషీన్ల వరకు అన్నింటినీ ఒకే దెగ్గర ఉంచడం వల్ల ఏదన్నా కెమికల్ రియాక్షన్ వల్ల మాన్తా అందుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా. సదరు గోడౌన్ యజమాని మాత్రం ఇదెవ్వరో కావాలని చేసిన పనిగా చెబుతున్నారు. ఎవరన్నా వచ్చి నిప్పంటించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రమాదానికి షాట్ సర్క్యూట్ మాత్రం కాదని తెలియవస్తుంది. షాట్ సర్క్యూట్ అయ్యి ఉంటే కరెంటు పోయి ఉండేదని కానీ, ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చాక కూడా విద్యుత్ సరఫరా ఉందని కాబట్టి ఇది షాట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ప్రమాదం కాదని తెలుస్తోంది. 

ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో పై అంతస్థులో నివసిస్తున్న కొందరు యువకులు పక్క బిల్డింగ్ మీదకు దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. చుట్టూ ఒకింత ఖాళీ స్థలం ఉండడం వల్ల పక్క భవంతులు మంటలు వ్యాపించలేదని, లేకుంటే భారీ స్థాయిలో నష్టం జరిగి ఉండేదని ఫైర్ అధికారులు తెలుపుతున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బంది లోపల ఉన్న సీసీటీవీ ఫ్యూటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు.