సికింద్రాబాద్‌ పాలిక బజార్‌లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

సికింద్రాబాద్ పాలికాబజార్ లో  ఓ వస్త్ర దుకాణంలో  ఆదివారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది.  నాలుగు ఫైరింజన్లతో  అధికారులు మంటలను ఆర్పుతున్నారు.
 

 Fire Breaks  out  at  Palika bazar  in  Secunderabad lns


హైదరాబాద్: సికింద్రాబాద్ పాలికాబజార్ లోని  ఓ వస్త్ర దుకాణంలో  ఆదివారంనాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.  పాలికాబజారులో  పలు వస్త్ర దుకాణాలున్నాయి.  ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా   అగ్ని మాపక సిబ్బంది  జాగ్రత్తలు తీసుకున్నారు. పాలిక బజారులో ఉన్న  దుకాణాల యజమానులను పిలిపించి  మంటలు  ఇతర  దుకాణాలకు  వ్యాపించకుండా  అగ్ని మాపక సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా  అగ్ని ప్రమాదం జరిగిందని  అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రమాదం జరిగిన  దుకాణం సమీపంలోని  లాడ్జీలను  పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.అంతేకాదు  ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఫ్లెక్సీలను  అధికారులు తొలగించారు. ఫ్లైక్సీల కారణంగా  మంటలు త్వరగా  వ్యాపించే అవకాశం ఉన్నందున  అధికారులు ఈ ఫ్లైక్సీలను తొలగించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నమోదౌతున్నాయి.   విశాఖపట్టణం నేవీ క్యాంటిన్ వద్ద ఈ నెల  3వ తేదీన  అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.  ఈ ఏడాది జూన్  30వ తేదీన  అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో  సాహితీ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. 

also read:ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం.. లోకో‌పైలట్ ఫిర్యాదుతో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పల్నాడు జిల్లాలోని పెద్దపాలెంలో  జూన్  14న అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి సజీవ దహనమైంది.  ఈ ఏడాది జూన్  16న తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఫోటో ఫ్రేమ్ వర్క్స్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.  మూడు గంటలపాటు కష్టపడి  మంటలను  ఆర్పారు. జూన్ 16న  ఓన్‌జీసీ  లో గ్యాస్ లీకైంది. దీంతో  మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  అధికారులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే అధికారులు రంగంలోకి దిగి  మంటలను ఆర్పివేశారు. ఈ ఏడాది జూన్  24న ప్రకాశం జిల్లా దర్శిలో  బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. 
 

అగ్ని ప్రమాద స్థలాన్ని  పరిశీలించిన  మంత్రి తలసాని

సికింద్రాబాద్ పాలిక బజార్ లో  అగ్ని ప్రమాదం  జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇవాళ సందర్శించారు.  అగ్ని ప్రమాదం  జరగడానికి గల కారణాలపై మంత్రి తెలుసుకున్నారు.   సహాయక చర్యలపై  మంత్రి ఆరా తీశారు. మంటలు  ఇతర దుకాణాలకు  వ్యాపించకుండా  చర్యలు తీసుకోవాలని  మంత్రి అధికారులను  ఆదేశించారు.   తరచుగా  అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి  అధికారులను ఆదేశించారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios