తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చందక్ లేబొరేటరీస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బీబీనగర్ మండల పరిధిలోని చందక్ లేబొరేటరీస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచరాం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై బీబీనగర్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘చందక్ ల్యాబొరేటరీస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’అని చెప్పారు.
