హైద్రాబాద్ కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు గుర్తించారు.  ఇతర దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మంటలను ఆర్పుతున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ ఆల్విన్ కాలనీలో బుధవారం నాడు ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్నారు.

Scroll to load tweet…

కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో గల బట్టల దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఫైర్ ఫైటర్లు శ్రమిస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆల్విన్ కాలనీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రెండు పైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ఉన్న ఇతర షాపుల్లోని వారిని కూడ అక్కడి నుండి పంపారు.