పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలిచారు. ఆ వార్త తెలియగానే టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
అక్కడ ఒకొరికొకరు అభినందనలు తెలియజేసుకుంటూ టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఐతే టపాసుల కాల్చే సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి.. తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఉన్న ఎండిన చెట్లపై పడ్డాయి.
వెంటనే మంటలు చెలరేగి అవి క్షణాల్లో మిగతా చెట్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఈ స్థానంలో 93 మంది అభ్యర్ధులకు గాను 91 మంది ఎలిమినేషన్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,49,269 ఓట్లు బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు, కె.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు వచ్చాయి. తద్వారా 11,703 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి నిలిచారు.
"
