భద్రాద్రి జిల్లా పర్ణశాల వద్ద తెప్పోత్సవంలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. హంస వాహనాన్ని అనుసరిస్తున్న ఓ బోటులో ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలింది. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు నలుగురు వ్యక్తులు గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గల్లంతవ్వగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.