రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రైలు సర్వీసులు నిలిపివేత

fire accident in hyderabad
Highlights

రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రైలు సర్వీసులు నిలిపివేత

హైదరాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏషియన్ పెయింట్స్‌కు సంబంధించిన గోడౌన్‌లో సిలిండర్ పేలడంతో మంటలు చేలరేగాయి.. చూస్తుండగానే అవి గోడౌన్‌ మొత్తానికి వ్యాపించాయి. గోడౌన్‌లో నిల్వవుంచిన పెయింట్ డబ్బాలు పేలుతుండటంతో పాటు మంటలు సమీప భవనాలకు వ్యాపించడంతో.. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు మరింత ఎక్కువుతుండటంతో సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

loader